ॐ దేవల మనుబ్రహ్మ ॐ
ఎవ్వాఁ డు శివనిటాలేక్షణంబున స్వయం
ప్రాదుర్భావము గాంచి వరలినాడో,
ఎవ్వాఁ డు దేవాళికెల్ల వస్త్రములిచ్చి
దేవాంగుఁ డగుచుఁ గీర్తిఁ గనినాడో,
ఎవ్వాఁడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి
బ్రహ్మత్వమిడిన సద్బ్రాహ్మణుండో,
ఎవ్వాఁడు రంభారతీచ్ఛా విముఖుఁడౌచు
నిస్సంగతా రూఢి నెఱపినాఁడో,
ఎవ్వాఁడు విద్యాధరుండాది యేడుగాఁగ
రూపములు తాల్చి ధర్మమ్ముఁ బ్రోచినాఁడో,
మనుకులాభరణమతఁడు మాకులమ్ము
వారికాద్యుఁడు దేవలబ్రహ్మఁ గొలుతు.
-- స్వర్గీయ విద్వాన్ పింజల సోమశేఖరరావు గారు
ఎవ్వాఁ డు శివనిటాలేక్షణంబున స్వయం
ప్రాదుర్భావము గాంచి వరలినాడో,
ఎవ్వాఁ డు దేవాళికెల్ల వస్త్రములిచ్చి
దేవాంగుఁ డగుచుఁ గీర్తిఁ గనినాడో,
ఎవ్వాఁడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి
బ్రహ్మత్వమిడిన సద్బ్రాహ్మణుండో,
ఎవ్వాఁడు రంభారతీచ్ఛా విముఖుఁడౌచు
నిస్సంగతా రూఢి నెఱపినాఁడో,
ఎవ్వాఁడు విద్యాధరుండాది యేడుగాఁగ
రూపములు తాల్చి ధర్మమ్ముఁ బ్రోచినాఁడో,
మనుకులాభరణమతఁడు మాకులమ్ము
వారికాద్యుఁడు దేవలబ్రహ్మఁ గొలుతు.
-- స్వర్గీయ విద్వాన్ పింజల సోమశేఖరరావు గారు